prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 September 2026, 4:46 pm Digital Edition : PRAJA VANI

జిల్లా పరిషత్ ఉన్నంతపాఠశాలలో ఘనంగా అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం

జిల్లా పరిషత్ ఉన్నంతపాఠశాలలో ఘనంగా అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం

జమ్మికుంట సెప్టెంబర్ 8 (ప్రజావాణి)

 

కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇల్లంతకుంట మండల కేంద్రంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇల్లందకుంట యందు గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు హుజురాబాద్ వాస్తవ్యులు, సామాజికవేత్త డాక్టర్ గంగిశెట్టి జగదీశ్వర్ రిటైర్డ్ ఉపాధ్యాయులు ఇల్లందకుంట పాఠశాలలో అక్షరాస్యత సామాజిక అభివృద్ధిఅంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగినదిఈ వ్యాసరచన పోటీలలో 8వ తరగతి, 9వ తరగతి పదవ తరగతి నుండి 120 మంది విద్యార్థులు పాల్గొనగా పదవ తరగతికి చెందిన మంకు రచన, బి. రాజేష్, వీ. శరణ్య ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలనుసాధించారుఎనిమిదవ తరగతికి చెందిన పి. అక్షయ 4వ స్థానం, ఎన్. శృతి ఐదవ స్థానం 9వ తరగతికి చెందిన టి. సూర్య తేజ ఆరోస్థానం సాధించడం జరిగినది. ఈ వ్యాసరచన పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు శంకర్ నారాయణ డిక్షనరీని పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు కే. జయప్రకాష్ సామాజిక కార్యకర్త డాక్టర్ జగదీశ్వర్, పాఠశాల ఉపాధ్యాయుల చేతుల మీదుగా బహుమతి ప్రధానం చేయడం జరిగినదిపాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు కే. జయప్రకాష్ మాట్లాడుతూ గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, డాక్టర్ జగదీశ్వర్ మా పాఠశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇల్లందకుంట యందు విద్యార్థులకు మెరిటోరియల్ స్కాలర్షిప్, ప్రతి సంవత్సరము 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లను, గణిత ప్రతిభ పోటీలను, సైన్స్ ప్రతిభ పోటీలను నిర్వహించి విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేయడం విద్యార్థులను ఉన్నత చదువుల కొరకై ప్రోత్సహించడం జరుగుతుందని తెలియజేశారుపాఠశాల ఉపాధ్యాయులు సిహెచ్. వేణు మాట్లాడుతూ గంగిశెట్టి మధురమ మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు గంగిశెట్టి జగదీశ్వర్ రిటైర్డ్ ఉపాధ్యాయులు హుజురాబాద్ వాస్తవ్యులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలఇల్లందకుంట పాఠశాలకు ప్రతి సంవత్సరం గణిత ప్రతిభ పోటీలు సైన్స్ ప్రతిభ పోటీలు ఇంగ్లీష్ టాలెంట్ టెస్టులు హ్యాండ్ రైటింగ్ పోటీలుఅలాగే పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పెన్నులు ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలలో అత్యున్నత మార్కులు సాధించిన వారికి మెరిటేరియల్ స్కాలర్షిప్ నగదు పురస్కారం ఇంగ్లీష్ డిక్షనరీలు ఇస్తున్నారని తెలియజేశారుఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి ఉపాధ్యాయులు కే. జయప్రకాష్ సిహెచ్. వేణు కొండ సత్యం జి. అన్నపూర్ణ కే. శంకర్ జె. రాధికారానీ ఏ. సురేష్ డి. ఉమాదేవి ఎం. ఐలయ్య సిహెచ్. రామకృష్ణ జి. శైలజ ఆర్. దేవేందర్ ఎం. స్రవంతి వనిత డి పరమేష్ విశ్వతేజ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.