జిల్లా కోసం టవర్ ఎక్కిన వీరుడు నేడు మంచానికే పరిమితం
*జిల్లా కోసం టవర్ ఎక్కిన వీరుడు నేడు మంచానికే పరిమితం - గుండె ఆపరేషన్ కు సాయం కోసం ఎదురుచూపు* *జనగామ జిల్లా ఉద్యమకారుడు ఇరుగు రమేష్ ఆర్థిక కష్టాల్లో - దాతల సహాయం కోసం వేడుకోలు* జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 27(ప్రజావాణి): ఉద్యమం కోసం ఉద్యోగాన్ని వదిలాడు.. జిల్లా కోసం టవర్ ఎక్కాడు.. జైలుకెళ్లాడు.. నేడు అదే ఉద్యమకారుడు అనారోగ్యంతో, ఆర్థిక ఇబ్బందులతో అల్లాడుతున్నాడు. ఆయనే జనగామ జిల్లా ఉద్యమకారుడు ఇరుగు రమేష్. తన తల్లిదండ్రులను కోల్పోయి, ప్రస్తుతం పెయింటింగ్ పనులు...