జిల్లా కాంగ్రెస్ పగ్గాలు చంద్రశేఖర్ రెడ్డికి

జిల్లా కాంగ్రెస్ పగ్గాలు చంద్రశేఖర్ రెడ్డికి సుదీర్ఘ రాజకీయ అనుభవానికి దక్కిన గుర్తింపు సంగారెడ్డి, సెప్టెంబర్ 20 (ప్రజావాణి): సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడిగా నారాయణఖేడ్‌కు చెందిన పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే.సి. వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు.(డీసీసీ )అధ్యక్ష పదవికి జిల్లాలో పలువురు ముఖ్య నాయకులు పోటీపడినప్పటికీ, పార్టీ కోసం సుదీర్ఘకాలంగా అంకితభావంతో పనిచేస్తున్న చంద్రశేఖర్ రెడ్డిని అధిష్ఠానం ఎంపిక చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. నారాయణఖేడ్ వంటి మారుమూల ప్రాంతం నుంచి...