prajavaani.net
Newspaper Banner
Date of Publish : 14 September 2026, 4:26 pm Digital Edition : PRAJA VANI

జానకి నగర్‌లో ఘనంగా వినాయక విగ్రహ పూజా కార్యక్రమం

జానకి నగర్‌లో ఘనంగా వినాయక విగ్రహ పూజా కార్యక్రమం
చిలుకూరు మండలం జానకి నగర్ గ్రామంలో వినాయక చవితి పండుగ సందర్భంగా గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో వినాయక విగ్రహాన్ని గ్రామంలోకి తీసుకువచ్చారు. గ్రామంలోని చిన్నలు, పెద్దలు, వార్డు సభ్యులు, సర్పంచ్, కమిటీ సభ్యులు కలిసి వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పండుగ వేదిక వద్దకు తీసుకువెళ్లారు.
విగ్రహాన్ని వేదికపై ప్రతిష్ఠించిన అనంతరం గ్రామ పెద్దలు, మహిళలు, యువత, చిన్నారులు, వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బానోతు అనూష, సర్పంచ్ భర్త బానోతు రవి, విగ్రహ దాత బానోతు పార్వతి, ధర్మ గారు మరియు వారి కుమారుడు బానోతు వంశీ, మరియు అమర్నాథ్, భట్టు భార్మవత్, సురేష్, ఇస్లావత్ సత్తార్, బాలాజీ, భార్మవత్ రాజేష్ తదితరులతో పాటు గ్రామంలోని చిన్నలు, పెద్దలు, మహిళలు, యువత పాల్గొన్నారు.
గ్రామ ప్రజలంతా కలిసి భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలను నిర్వహించుకోవడం పట్ల గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.