జాతీయ స్థాయి విశ్వ కళ విభూషణ్ పురస్కార అవార్డు నాగుల సత్యం గౌడ్ కు ప్రధానం
* ప్రజాకవి రచయిత బ్రహ్మశ్రీ ఆధ్యాత్మిక విశ్వ గురువు, యూనివర్సల్ బుక్ ఆఫ్ రికార్డు అవార్డు గ్రహీత తత్వవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాగుల సత్యం గౌడ్ కు జాతీయస్థాయి విశ్వ కళ విభూషణ్ పురస్కార ప్రధానం
జమ్మికుంట సెప్టెంబర్ 28 (ప్రజావాణి)
పట్టణానికి చెందిన మానవ విలువల పరిరక్షణ జాతీయ అధ్యక్షులు, ప్రజాకవి రచయిత వ్యక్తిత్వ వికాస నిపుణులు, అంతర్జాతీయ స్థాయి వరల్డ్ రికార్డ్ అవార్డు గ్రహీత, యూనివర్సల్ బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డు గ్రహీత తత్వవేత్త బ్రహ్మశ్రీ ఆధ్యాత్మిక విశ్వ గురువు డాక్టర్ నాగుల సత్యం గౌడ్ సామాజిక సేవలు, రచనలు వారి ఆధ్యాత్మిక సేవలను … తెలుగు వెలుగు సాహితీ వేదిక, మరియు తెలుగు ఇండియన్ కల్చరల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, శ్రీ విరాట్ విశ్వకర్మ విజ్ఞాన ఆధ్యాత్మిక ధార్మిక కళాపరిషత్ పలు సంస్థల వ్యవస్థాపకులు పోలోజు రాజకుమార్ సత్యం గౌడ్ సేవలను గుర్తించి … వీరిని , అంతర్జాతీయ స్థాయి విశ్వ కళ విభీషణ్ అవార్డుకు ఎంపిక చేసి, ఈ యొక్క అవార్డును హనుమకొండ బస్టాండ్ పద్మాక్షి ఆవరణలో గల జయకృష్ణ హాస్పిటల్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ఆ సంస్థల వ్యవస్థాపకులు పోలోజు రాజకుమార్ తో పాటు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలు గా వచ్చిన విశ్వ కళ విరాట్ డాక్టర్ వంగల శాంతి కృష్ణ చార్య ప్రపంచ వరల్డ్ రికార్డు అవార్డు గ్రహీత, ప్రముఖ హాస్య నటులు ఆర్ఎస్ నంద, ప్రముఖ సినిమా నటి నువ్వు ముఖర్జీ వివిధ సంస్థల అధ్యక్షులు సామాజికవేత్త వనపర్తి పద్మజ, సామాజికవేత్త మల్లికార్జున్, సాజనాటి గుంటుక రాధిక, ప్రముఖ న్యాయవాది ఏ కిరణ్ కుమార్, సామాజిక సేవకులు ఎడిటర్ కరీంనగర్ భూమి తెలుగు దినపత్రిక బిడ్డల ప్రశాంత్,వివిధ సంస్థల వ్యవస్థాపకులు వలబోజు మోహన్ రావు, పాడిశెట్టి విష్ణువర్ధన్, అడ్డంకి నాగరాజు, సకల కళా రత్న శ్రీ అక్కనపల్లి యాదగిరి గౌడ్, తదితర ప్రముఖులు సత్యం గౌడ్ కు పట్టు శాల కప్పి, మెడల్ మరియు గురు కిరీటమును ధరింపజేసి జ్ఞాపకను అందజేసి, జాతీయ స్థాయి విశ్వ కళ విభూషణ్ అవార్డును ప్రధానం చేసి ఆదివారం ఘనంగా సన్మానించారుఈ సందర్భంగా వివిధ సంస్థల వ్యవస్థాపకులు పోలోజు రాజ్ కుమార్ తో పాటు ఈ కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథిలు మాట్లాడుతూసత్యం గౌడ్ ఆధ్యాత్మిక సేవలువారి రచనలు సామాజిక సేవలు వెలకట్టని విలువలన్నారు ఇంతటి అపార జ్ఞానం కలిగిన సత్యం గౌడ్ దైవాంశ సంభూతులన్నారు. ఇంతటి ఆధ్యాత్మికంగా మనం ఏర్పరచుకున్న విలువలపై అనార్కళంగా మాట్లాడే శక్తి కలిగిన సత్యం గౌడ్ సమాజానికి ఎంతో ఉపయోగపడటం అభినందనీయం అన్నారు అనంతరం ఆధ్యాత్మిక విశ్వగురువు సత్యంగౌడు మాట్లాడుతూప్రతి ఒక్కరూ మనసును అదుపులో పెట్టుకొని మనసు నిర్మలం పరుచుకొని ప్రశాంతముగా బ్రతకాలి అన్నారు. ఎందరో కళాకారులను ఆర్టిస్టులను నృత్య కళాకారులను కవులను రచయితలను సామాజిక వేత్తలను ప్రోత్సహిస్తూ వారిని ఆదరిస్తూ వారిలో ఉన్న ప్రతిభను బయటికి తీసి ఎందరికో వారి సంస్థల పక్షాన అవార్డులు రివార్డులు సత్కారాలు అందజేసి తనదైన శైలిలో పోలోజు రాజ్ కుమార్ చేస్తున్న వారి సేవలు అపారమన్నారు. మనుషులు ఒకరికి ఒకరు నష్టం చేసుకోకుండా మనిషి మనిషికి సహకరించే దృక్పధాన్ని అలవర్చుకొనిప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకొని ప్రశాంతమైన జీవితాన్ని గడపాలన్నారు మనిషి జన్మలో మనిషికి మహోన్నతమైన మంచి మనసు ఉంటుందని, ఆ యొక్క మనసును సత్ప్రయోజనాలకు సేవా భావాలకు ఆదర్శప్రాయంగా మెదులుతూ మనం ఏర్పరచుకున్న మంచి మానవత్వాన్ని కాపాడుకుంటూ ఆదర్శవంతంగా జీవించలనున్నారుసమాజాని కిదేశానికి మూల స్తంభాలాంటి వారు నేటి యువత విద్యార్థులేననిఇందుకు ప్రతి విద్యార్థి ప్రయోజకుడుగా ఎదిగి నవ సమాజ నిర్మాణానికి పునాదిగా నిలవాలన్నారు విద్యార్థులు యువత చెడు వేసినాలకు దూరంగా ఉండి దేశ అభివృద్ధికి తోడ్పడుతూ సమాజ సేవలో భాగస్వాములు కావాలని సత్యం గౌడ్ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు అంటరాని స్వార్ధాన్ని వదులుకొని లోక కళ్యాణంలో భాగస్వాములు కావాలని సత్యంగాడు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వివిధ సంస్థల వ్యవస్థాపకులు సామాజికవేత్తలు గురువులు కళాకారులు, కవులు రచయితలు డాన్స్ మాస్టర్లు టీవీ సీరియల్ ఆర్టిస్టులు నటులు నృత్య కళాకారులు వారి యొక్క పేరెంట్స్తదితరులు పాల్గొన్నారు.