జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు గట్ల మల్యాల విద్యార్థిని ఎంపిక
నంగునూరు, సెప్టెంబర్ 26:సిద్దిపేట జిల్లా గట్ల మల్యాల పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని బానోతు దీపిక జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికై పాఠశాలకు, గ్రామానికి గర్వకారణంగా నిలిచింది.ఈ నెల 18, 19, 20 తేదీల్లో నిజామాబాద్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో బానోతు దీపిక ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైంది. రాష్ట్రస్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించిన ఆమెకు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం లభించింది.ఈ నెల 27, 28, 29 తేదీల్లో మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో నిర్వహించనున్న జాతీయస్థాయి...