prajavaani.net
Newspaper Banner
Date of Publish : 27 September 2026, 7:23 am Digital Edition : PRAJA VANI

జవహర్‌నగర్‌లో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు

జవహర్‌నగర్‌లో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు

నివాళులర్పించిన మాజీ మేయర్ శాంతి,కోటేశ్ గౌడ్

జవహర్‌నగర్, సెప్టెంబర్ 26:( ప్రజావాణి ప్రతినిధి)

జవహర్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని అంబేడ్కర్ నగర్, చాకలి ఐలమ్మ కాలనీ ధోబీఘాట్ వద్ద వీరనారి చిట్యాల (చాకలి) ఐలమ్మ 131వ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కుల సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ దొంతగాని శాంతి కోటేష్ గౌడ్ పాల్గొని మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటంలో భూమి, భుక్తి, వెట్టిచాకిరీ విముక్తి కోసం ఐలమ్మ చూపిన ధైర్యసాహసాలు, పోరాటస్ఫూర్తి ఎనలేనివని కొనియాడారు. ఐలమ్మ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆమె పోరాటపటిమను ఆదర్శంగా తీసుకుని నేటి యువత ముందుకెళ్లాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజి కార్పొరేటర్ బల్లి రోజా శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు వినయ్ కుమార్ అశోక్ గుప్తా, ఎర్రగుడ్ల వెంకటేశ్వర్లు, పెద్ది మురళి, మూల సోమయ్య గౌడ్, వెంకటేష్ గౌడ్, పొలాస సాయికుమార్, పొలాస కిరణ్ కుమార్, తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు శాగంటి వెంకటేష్, వివిధ సంఘాల కుల సంఘం ల నాయకులు, స్థానిక రాజకీయ నేతలు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.