prajavaani.net
Newspaper Banner
Date of Publish : 26 September 2026, 9:34 am Digital Edition : RAJU CHELUKAPALLY CHENNARAOPET

జయముఖిలో వైభవంగా ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవం 

జయముఖిలో వైభవంగా ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవం 

రోగుల భద్రతకే ప్రథమ పీఠం

చెన్నారావుపేట సెప్టెంబర్ 25 ప్రజావాణి

ఆరోగ్య రక్షణలో కీలకమైన ఫార్మసిస్ట్‌ల సేవలను స్మరిస్తూ, స్థానిక జయముఖి ఫార్మసీ కళాశాలలో ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. కాబోయే ఫార్మసిస్ట్‌లుగా విద్యార్థులు తమ సమాజ బాధ్యతను చాటుతూ ప్రతిజ్ఞ చేశారు.కార్యక్రమంలో భాగముగా నిర్వహించిన పలు వినూత్న సదస్సులు విద్యార్థులను విశేషంగా ఆకట్టుకున్నాయి.మార్కెట్‌లో లభించే వివిధ రకాల యాంటీబయాటిక్స్, వాటి దుర్వినియోగం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాల (ఏడిఆర్ఎస్) పై విద్యార్థుల మధ్య చర్చ సాగింది. సృజనాత్మకతను చాటేలా నిర్వహించిన ‘బోర్డ్ డెకరేషన్’ పోటీ విజేతలకు బహుమతులు అందజేశారు.బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్సీ) నిర్వహించిన ప్రత్యేక వెబ్‌నార్ ద్వారా విద్యార్థులకు భవిష్యత్ ఆర్థిక ప్రణాళికలు, పొదుపు సూత్రాలపై దిశానిర్దేశం చేశారు. డా.ఎస్. వాసుదేవమూర్తి మాట్లాడుతూ… ఔషధాల నాణ్యత, సరైన మోతాదును అందించడంలో ఫార్మసిస్ట్‌దే ముఖ్య పాత్రని స్పష్టం చేశారు. రోగుల భద్రతను ధ్యేయంగా పెట్టుకుని, వైద్యులకు-రోగులకు మధ్య సంధానకర్తగా ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్వేత కార్యక్రమ అధికారి గోపు శ్వేత మాట్లాడుతూ… వైద్యుల సలహా లేకుండా యాంటీబయాటిక్స్ వాడటం వల్ల శరీరంలో యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) పెరిగి సాధారణ రోగాలు కూడా ప్రమాదకరంగా మారతాయని హెచ్చరించారు. మందుల కోర్సును మధ్యలోనే ఆపకుండా వాడేలా ప్రజల్లో చైతన్యం తేవాల్సిన బాధ్యత ఫార్మసిస్ట్‌లపై ఉందన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.