prajavaani.net
Newspaper Banner
Date of Publish : 26 September 2026, 8:30 pm Digital Edition : PRAJA VANI

జనగామ వీవర్స్ కాలనీలో అంగరంగ వైభవంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు

*జనగామ వీవర్స్ కాలనీలో అంగరంగ వైభవంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు – లబ్ధిదారులకు వస్త్రాలు అందజేసిన మంత్రి పొంగులేటి*

జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 26(ప్రజావాణి):
శనివారం జనగామ పట్టణంలోని వీవర్స్ కాలనీ 12వ వార్డులో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాల కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరై.. డోర్నాల లావణ్య-శ్రీనివాస్, కందగట్ల మమత, చుంచు సుమలత-రాజ్ కుమార్, బిర్రు భవాని-మల్లేష్, కొండ ధనలక్ష్మి తదితర లబ్ధిదారుల ఇళ్లకు గృహ ప్రవేశం చేశారు. అనంతరం లబ్ధిదారులకు నూతన వస్త్రాలను మంత్రి అందజేశారు.

అదే విధంగా వీవర్స్ కాలనీలోని చేనేత కుటుంబాలు మగ్గాలపై నేస్తున్న వస్త్రాలను మంత్రి పరిశీలించి, వారి కళా నైపుణ్యాన్ని అభినందించారు. సంప్రదాయ చేనేతకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో చేనేత కార్మికుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు.

ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, డీసీపీ రాజ మహేంద్ర నాయక్, జనగామ మున్సిపల్ చైర్ పర్సన్ కడకంచి బాలమణి, డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి, మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.