prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 September 2026, 5:00 pm Digital Edition : PRAJA VANI

జనగామ యూపీహెచ్సీలో ఆయుష్ వైద్య శిబిరం

*జనగామ యూపీహెచ్సీలో ఆయుష్ వైద్య శిబిరం*

జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 23(ప్రజావాణి):
11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకల్లో భాగంగా జనగామ పట్టణంలోని
యూపీహెచ్సీ(UPHC)లో బుధవారం ఆయుష్ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (DM&HO) డా. వాణిశ్రీ ప్రారంభించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన వైద్య శిబిరంలో ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఆయుష్ వైద్యం, ఆరోగ్య పరిరక్షణ, ఆరోగ్యకర జీవనశైలి విధానాలపై అవగాహన కల్పించారు. శిబిరంలో మొత్తం (520) మంది రోగులు పాల్గొని, వైద్య సేవలను పొందారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఆయుష్ అధికారి డా. మమత, డా. సరిత, డా. ప్రియదర్శిని, డా. జునైద్, డీపీఎం కుమార్, డా. అనురాధ, ఇతర ఆయుష్ వైద్యులు, యూపీహెచ్సీ సిబ్బంది పాల్గొన్నారు.