జనగామ మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు విడుదల చేయాలి
*జనగామ మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు విడుదల చేయాలి - మంత్రి పొంగులేటికి ఎమ్మెల్యే పల్లా వినతి* జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 26 (ప్రజావాణి): జనగామ జిల్లాలో రాష్ట్ర గృహ నిర్మాణం, రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ముందుగా జనగామ మున్సిపల్ కార్యాలయంలో రూ.1.77 కోట్ల విలువైన 16 నూతన చెత్త సేకరణ ఆటోలు, జేసీబీని ప్రారంభించారు. మున్సిపాలిటీ పరిధిలో 54...