prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 8:18 pm Digital Edition : PRAJA VANI

జనగామ జిల్లా టీఆర్పీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా మాజీ సైనికుడు నరసింహ రాములు నియామకం

*జనగామ జిల్లా టీఆర్పీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా మాజీ సైనికుడు నరసింహ రాములు నియామకం*

పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న చేతుల మీదుగా నియామక పత్రం అందజేత

జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 18(ప్రజావాణి):
తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) సంస్థాగత నిర్మాణంలో భాగంగా జనగామ జిల్లా కమిటీలో కీలక నియామకం జరిగింది. జిల్లా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా మాజీ సైనికుడు నరసింహ రాములు నియమితులయ్యారు.

పాదయాత్రలో భాగంగా శుక్రవారం జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేతుల మీదుగా నరసింహ రాములు నియామక పత్రాన్ని అందుకున్నారు.

రాష్ట్ర కార్యవర్గం సూచనల మేరకు, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బందారపు నర్సయ్య గౌడ్ ఆమోదంతో ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షులు మల్లన్న మాట్లాడుతూ.. దేశ రక్షణలో కీలకంగా వ్యవహరించిన మాజీ సైనికుడు నరసింహ రాములు పార్టీ బలోపేతం కోసం క్రమశిక్షణతో పనిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ, పార్టీ ఆశయాలను, భావజాలాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. అంకితభావం, నిబద్ధతతో పనిచేస్తూ జనగామ జిల్లాలో పార్టీ నిర్మాణానికి ప్రత్యేక కృషి చేయాలని కోరుతూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
బాధ్యతలు చేపట్టిన అనంతరం నరసింహ రాములు మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో కీలక బాధ్యతను అప్పగించిన పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న కి, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బందారపు నర్సయ్య గౌడ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజని కుమార్ యాదవ్, ఉమ్మడి జిల్లా ఇంచార్జి పల్లెబోయిన అశోక్ ముదిరాజ్, జిల్లా అధ్యక్షులు కట్ల సదానందం, జనగామ నియోజకవర్గ ఇంచార్జి మాచర్ల బిక్షపతి, రాష్ట్ర, జిల్లా కార్యవర్గానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
పార్టీలో క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించేది లేదని, అందరినీ కలుపుకుంటూ జనగామ జిల్లాలో పార్టీ జెండాను ఎగురవేయడానికి శాయశక్తులా కృషి చేస్తానని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కొమ్ముల ప్రవీణ్ రాజ్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పటేల్ వనజక్క, జిల్లా మహిళా అధ్యక్షురాలు దండు రాణి, కృష్ణ మరియు తదితర నాయకులు పాల్గొన్నారు.