*జనగామ జిల్లా కాంగ్రెస్ కార్యాలయాన్ని సందర్శించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి*
ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు –
కార్యకర్తలతో సమావేశం – డీసీసీ కార్యాలయానికి స్థలం కేటాయించాలని వినతి – నాయకులు,కార్యకర్తల కోసం సారథి యాప్ ప్రారంభం
జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 26(ప్రజావాణి_): జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ మరియు ఇన్ఫర్మేషన్ & పబ్లిక్ రిలేషన్స్ శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శనివారం జిల్లా పర్యటనలో భాగంగా, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ధన్వంతి లకావత్, YTDA మెంబర్ డాక్టర్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు.
చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు
జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి లక్ష్మీనారాయణ లకావత్, నాయకులు చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని, ధైర్యసాహసాలను, సామాజిక అన్యాయానికి వ్యతిరేకంగా ఆమె సాగించిన పోరాటాన్ని నాయకులు, కార్యకర్తలు గుర్తు చేసుకున్నారు. ఆమె ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సామాజిక న్యాయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కార్యకర్తలతో మంత్రి సమావేశం
అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు తమ ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలపై వెంటనే స్పందించిన మంత్రి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అలాగే జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి, పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, నాయకులు, కార్యకర్తల సమన్వయం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం వంటి అంశాలపై మంత్రి నాయకులు, కార్యకర్తలతో చర్చించారు.
డీసీసీ కార్యాలయానికి స్థలం కేటాయించాలని వినతి
జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీకి శాశ్వత డీసీసీ కార్యాలయం ఏర్పాటు చేసుకునేందుకు స్థలాన్ని కేటాయించాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ధన్వంతి లక్ష్మీనారాయణ లకావత్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని కోరారు.
డీసీసీ కార్యాలయానికి స్థలం అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లగా, మంత్రి వెంటనే స్పందించి సంబంధిత అధికారులకు వివరాలు తెలియజేసి, తగిన స్థలాన్ని పరిశీలించి కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సారథి యాప్ ప్రారంభం
అనంతరం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ సమాచారాన్ని నాయకులు, కార్యకర్తల ద్వారా ప్రజలకు మరింత సమర్థవంతంగా చేరవేసేందుకు డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలో రూపొందించిన “సారథి యాప్”ను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కార్యకర్త సారథి యాప్‌ను ఉపయోగించుకోవాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాల సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలో యాప్‌ను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని మంత్రి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జనగామ నియోజక వర్గ ఇంచార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కడకంచి బాలమణి శ్రీనివాస్, మాజీ మున్సిపల్ మార్కెట్ చైర్మన్ ఎర్రమల సుధాకర్, మాజీ మున్సిపల్ చైర్మన్ వేమళ్ల సత్యనారాయణ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ కంచ రాములు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు వేముల మల్లేష్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు బడికే ఇందిరా కృష్ణస్వామి, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు జాయ మల్లేష్, డీసీసీ జనరల్ సెక్రటరీ జిల్లెల్ల సిద్ధారెడ్డి, చింతకింది మల్లేష్, బోట్ల శ్రీనివాస్, కళ్యాణం చంద్రమౌళి, డీసీసీ స్పోక్స్‌పర్సన్ నరేందర్ పవార్, అర్జుల సుధాకర్, గూగులోత్ కిషన్, రామచంద్రం, సర్పంచ్ జుమ్లా, ఓబీసీ సెల్ నాయకులు పులి గణేష్, ఎల్లయ్య, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.