జనగాంలో నూతన స్వచ్ఛ ఆటోల ర్యాలీ ఘనంగా ప్రారంభం

*జనగాంలో నూతన స్వచ్ఛ ఆటోల ర్యాలీ ఘనంగా ప్రారంభం* జనగాం, సెప్టెంబర్ 29 (ప్రజావాణి న్యూస్): జనగాం మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టేందుకు నూతనంగా అందుబాటులోకి వచ్చిన *స్వచ్ఛ ఆటోల ర్యాలీని* ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీకి మున్సిపల్ ఛైర్పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్, కమిషనర్ రాజశేఖర్ రెడ్డి లు జెండా ఊపి ప్రారంభించారు. నూతన స్వచ్ఛ ఆటోలకు పూలమాలలు వేసి, పట్టణ పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించి స్వచ్ఛతపై ప్రజల్లో అవగాహన కల్పించారు....