prajavaani.net
Newspaper Banner
Date of Publish : 24 September 2026, 1:57 pm Digital Edition : PRAJA VANI

జడ్పీటీసీ పదవి విరమణ సభ్యులుకు ఘనంగా సన్మానం

జడ్పీటీసీ పదవి విరమణ సభ్యులుకు ఘనంగా సన్మానం

అనంతపురం సెప్టెంబర్ 24(ప్రజావాణి) ప్రతినిధి ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అన్ని మండలాల జడ్పిటిసిలు పదవి విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గురువారం నగరంలోని స్థానిక జిల్లా పరిషత్ నందు జడ్పీ చైర్ పర్సన్ గిరిజమ్మ అధ్యక్షతన మరియు పాలకవర్గ సభ్యులు సీఈవో విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఆత్మీయ వీడ్గోలు సన్మాన సభ నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు జడ్పిటిసిలు మాట్లాడుతూ గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ప్రజలకు ఎనలేని సేవ చేయడమే లక్ష్యంగా నడవడం జరిగిందన్నారు, రాబోయే రోజులలో కూడా ప్రజల కోసం పనిచేయడానికి తమ సిద్ధంగా ఉంటామని తెలియజేశారు పేద విద్యార్థుల కోసం స్కూల్ కాలేజీలు సీట్ల కోసం ఎంత వరకు శ్రమించాలో అంతవరకు పనిచేసి విద్యార్థులకు చదువుకోటానికి వీలు కల్పించామని గుర్తుచేసుకున్నారు అదే విధంగా గ్రామీణ ప్రాంతం అభివృద్ధి కోసం వచ్చిన నిధులు దుర్వినియోగం కాకుండా పని చేశామని చెప్పుకొచ్చారు ప్రజా సమస్యల పట్ల పార్టీల తో సంబంధం లేకుండా ప్రజల కోసం పాటుపడాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో తదితర మండలాల జడ్పిటిసిలు పాల్గొన్నారు