prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 September 2026, 8:20 am Digital Edition : UPPU RAMESH JAGITHYAL

జగిత్యాలలో గణేష్ ఉత్సవాలకు పోలీసుల నిబంధనలు: ఆన్‌లైన్ నమోదు తప్పనిసరి

గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ కోరారు. భద్రతా కారణాల దృష్ట్యా మండపాల నిర్వాహకులు ఉచితంగా పోలీసు పోర్టల్‌లో https://policeportal.tspolice.gov.in/index.htm ఆన్‌లైన్ నమోదు చేసుకోవాలని సూచించారు. మండపాల వద్ద డీజేలపై పూర్తి నిషేధం విధించారు. రాత్రి 10 గంటల వరకే స్పీకర్లకు అనుమతి ఉంటుంది. సీసీ కెమెరాలు, అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేసుకోవాలని, మద్యం, జూదం, ఇతర వివాదాస్పద కార్యక్రమాలు చేపడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.