prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 September 2026, 12:17 pm Digital Edition : PRAJA VANI

జంగాల బజార్ కా రాజా గణపతికి ప్రత్యేక పూజలు చేసిన టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి

*జంగాల బజార్ కా రాజా గణపతికి ప్రత్యేక పూజలు చేసిన టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి*

జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 20(ప్రజావాణి):
తొర్రూరు పట్టణంలోని 8వ వార్డులో జంగాల బజార్ కా రాజా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రి మహోత్సవాల్లో టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, పాలకుర్తి నియోజకవర్గ ఇంచార్జి హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఆదివారం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

అసోసియేషన్ సభ్యుల ఆహ్వానం మేరకు గణపతి మండపాన్ని సందర్శించిన ఆమె, కొబ్బరికాయ కొట్టి విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, పాలకుర్తి నియోజకవర్గం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని ఆ గణనాథుడిని ప్రార్థించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా జంగాల బజార్ కా రాజా అసోసియేషన్ సభ్యులు ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారికి ఘన స్వాగతం పలికి, శాలువాతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, అసోసియేషన్ సభ్యులు , భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.