చౌదరిగూడలో పది కాలనీలకు సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలి
ఘట్కేసర్, సెప్టెంబర్ 30 (ప్రజావాణి): పోచారం డివిజన్ పరిధిలోని చౌదరిగూడ గ్రామంలోని పది కాలనీలలో నెలకొన్న రోడ్లు, డ్రైనేజీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ పోచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కర్ర రాజేష్ ఆధ్వర్యంలో ఘట్కేసర్ సర్కిల్ డీసీకి వినతిపత్రం అందజేశారు. చౌదరిగూడలోని పలు కాలనీలలో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ పూర్తిస్థాయిలో లేకపోవడంతో వర్షాకాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. మురుగునీరు నిలిచిపోవడంతో ప్రజలకు అసౌకర్యం కలుగుతోందని, కాలనీల్లో అవసరమైన ప్రాంతాలను గుర్తించి నూతనంగా సీసీ రోడ్లు, డ్రైనేజీ...