prajavaani.net
Newspaper Banner
Date of Publish : 30 September 2026, 5:11 pm Digital Edition : NNARSINGARAO GATKESKAR

చౌదరిగూడలో పది కాలనీలకు సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలి

ఘట్కేసర్, సెప్టెంబర్ 30 (ప్రజావాణి): పోచారం డివిజన్ పరిధిలోని చౌదరిగూడ గ్రామంలోని పది కాలనీలలో నెలకొన్న రోడ్లు, డ్రైనేజీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ పోచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కర్ర రాజేష్ ఆధ్వర్యంలో ఘట్కేసర్ సర్కిల్ డీసీకి వినతిపత్రం అందజేశారు.

చౌదరిగూడలోని పలు కాలనీలలో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ పూర్తిస్థాయిలో లేకపోవడంతో వర్షాకాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. మురుగునీరు నిలిచిపోవడంతో ప్రజలకు అసౌకర్యం కలుగుతోందని, కాలనీల్లో అవసరమైన ప్రాంతాలను గుర్తించి నూతనంగా సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టాలని కోరారు.

ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులతో సమన్వయం చేసి త్వరితగతిన అవసరమైన చర్యలు చేపట్టాలని డీసీని కోరినట్లు తెలిపారు. కాలనీలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ఘట్కేసర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కేశపావుల వినోద్ కుమార్, సిద్ధగోని రవి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.