చోద్యం చూస్తున్న రామగుండం మున్సిపల్ కమిషనర్!
ప్రధాన రహదారిపై వ్యర్థ జలాలు.. ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు గోదావరిఖని మార్కండేయ కాలనీలో రోడ్డుపైకి వ్యర్థ జలాలు వదులుతున్నా చర్యలు శూన్యం గోదావరిఖని మార్కండేయ కాలనీ ప్రధాన రహదారి వెంట ఓ ప్రముఖ వైద్యుడు నిర్మించిన భవనం నుంచి వ్యర్థ జలాలను రోడ్డుపైకి వదులుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు వాపోతున్నారు. ప్రధాన రహదారిపై మురుగునీరు...