చైనా సాఫ్ట్‌బాల్ పోటీలకు సిద్దిపేట విద్యార్థిని బానోతు ఈశ్వరి ఎంపిక *అంతర్జాతీయ క్రీడల్లో అద్భుతంగా రాణించి సిద్దిపేట పేరును నిలబెట్టాలి* -హరీశ్ రావు, మాజీ మంత్రి. *ఈశ్వరికి రూ.50 వేల ఆర్థిక సహాయం చేసిన హరీశ్ రావు*
నంగునూరు, సెప్టెంబర్ 26:అంతర్జాతీయ సాప్ట్ బాల్ క్రీడా పోటీలకు ఎంపికైన సిద్ధిపేట నియోజకవర్గం నంగునూరు మండలం గట్ల మాల్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని బానోతు ఈశ్వరి అంతర్జాతీయ సాఫ్ట్‌బాల్ పోటీలలో అద్భుతంగా రాణించాలని మాజీ మంత్రి సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు ఆకాంక్షించారు.ఎంపికై సిద్దిపేట జిల్లాకు, తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా చైనాలో నిర్వహించనున్న సాఫ్ట్ బాల్ సబ్ జూనియర్ ఆసియా క్రీడా పోటీల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు ఈశ్వరి ఎంపికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈశ్వరి...