నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి
చండూరు మున్సిపాలిటీ పరిధిలో మున్సిపాలిటీ కోసం మున్సిపల్ కమిషనర్ ఎల్ మల్లేశం చేయూత పెన్షన్ కోసం అర్హులైన లబ్ధిదారుల దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. ఇప్పటివరకు కింది కేటగిరీలలో దరఖాస్తులు అందాయని అన్నారు. ఈ కింది కేటగిరీలో వితంతు పింఛను 112 దరఖాస్తులు, ఒంటరి మహిళల పెన్షన్ 21 దరఖాస్తులు, వికలాంగుల పింఛను 59 దరఖాస్తులు, చేనేత కార్మికులు 86 దరఖాస్తులు, గీత కార్మికులు 45 దరఖాస్తులు, మొత్తం దరఖాస్తులు 323 వచ్చాయి. చేయూత పెన్షన్ల కు సంబంధించి దరఖాస్తుల స్వీకరణకు 15.09.2026 వరకు అవకాశం కల్పించబడినందున అర్హులైన వారు నిర్ణీత తేదీలోగా తమ దరఖాస్తులను మున్సిపల్ కార్యాలయంలో సమర్పించాలని కోరారు.