చేయూత పింఛన్ వెరిఫికేషన్ కు సహకరించండి – మధ్యవర్తులకు డబ్బులు ఇచ్చి మోసపోకండి
నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి
చండూరు మున్సిపాలిటీ పరిధిలో చేయూత పింఛన్‌కు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వెరిఫికేషన్ ప్రక్రియ ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. వెరిఫికేషన్ అధికారులు లబ్ధిదారుల ఇంటి వద్దకు వచ్చి క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ చేస్తున్నారు. ఈ వెరిఫికేషన్ ప్రక్రియ (25.09.2026) శుక్రవారం వరకు నిర్వహించడం జరుగుతుంది. కావున పింఛన్‌కు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు తమ ఇంటి వద్ద అందుబాటులో ఉండి, వెరిఫికేషన్‌కు అవసరమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ మల్లేశం సూచించారు. ముఖ్యంగా ప్రజలు మధ్యవర్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వెరిఫికేషన్ చేయిస్తామని, పింఛన్ మంజూరు చేయిస్తామని లేదా దరఖాస్తు త్వరగా పూర్తిచేస్తామని చెప్పే వ్యక్తులకు ఎలాంటి డబ్బులు ఇవ్వవద్దు. డబ్బులు ఇచ్చి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. పింఛన్‌కు సంబంధించిన ఏవైనా సందేహాలు లేదా సమస్యలు ఉంటే నేరుగా చండూరు మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.