చిన్నముప్పారంలో’భూ’రీసర్వే పై గ్రామసభ
చిన్నముప్పారంలో'భూ'రీసర్వే పై గ్రామసభ ప్రజావాణి,ఇనుగుర్తి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతిలో భూముల రీసర్వే పై మండలంలోని చిన్న ముప్పారం లో ఆ గ్రామ సర్పంచి రాయలి భవాని శేఖర్ అధ్యక్షతన శనివారం గ్రామసభ, రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.దీనికి స్థానిక తహసిల్దార్ సుంకరి శ్రీనివాసులు, ఏడిఎస్ఆర్ఎల్ శ్రీనివాసులు సర్వేయర్ మురళి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తహసిల్దార్ శ్రీనివాసులు మాట్లాడుతూ రైతులు సంబంధిత అధికారులకు తమ వివరాలన్నీ చెబుతూ సహకరించాలని సూచించారు.రీ-సర్వే యొక్క ఉద్దేశ్యం, భూముల సర్వే ప్రక్రియ, భూ హద్దుల నిర్ధారణ, రికార్డుల...