చిన్నముప్పారంలో’భూ’రీసర్వే పై గ్రామసభ
ప్రజావాణి,ఇనుగుర్తి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతిలో భూముల రీసర్వే పై మండలంలోని చిన్న ముప్పారం లో ఆ గ్రామ సర్పంచి రాయలి భవాని శేఖర్ అధ్యక్షతన శనివారం గ్రామసభ, రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.దీనికి స్థానిక తహసిల్దార్ సుంకరి శ్రీనివాసులు, ఏడిఎస్ఆర్ఎల్ శ్రీనివాసులు సర్వేయర్ మురళి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తహసిల్దార్ శ్రీనివాసులు మాట్లాడుతూ
రైతులు సంబంధిత అధికారులకు తమ వివరాలన్నీ చెబుతూ సహకరించాలని సూచించారు.రీ-సర్వే యొక్క ఉద్దేశ్యం, భూముల సర్వే ప్రక్రియ, భూ హద్దుల నిర్ధారణ, రికార్డుల నవీకరణ తదితర అంశాలపై రైతులకు, గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా తహసిల్దార్ రీ-సర్వే ప్రక్రియలో రైతులు తమ భూములకు సంబంధించిన వివరాలను పరిశీలించి, సర్వే సిబ్బందికి అవసరమైన సహకారం అందించాలని సూచించారు.భూ హక్కులు,భూ రికార్డులకు సంబంధించిన వివరాల విషయంలో రైతులు అపోహలకు లోనుకాకుండా, అధికారుల సూచనలను పాటిస్తూ రీ-సర్వే ప్రక్రియలో భాగస్వాములు కావాలని అధికారులు సూచించారు.కార్యక్రమంలో ఆర్ ఐ మున్వర్,సర్వే సిబ్బంది, గ్రామ పరిపాలన అధికారులు, రైతులు పాల్గొన్నారు.