prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 8:33 am Digital Edition : PRAJA VANI

చిన్నంబావి బిజెపి పార్టీకార్యాలయంలో తెలంగాణవియోచన దినోత్సవం కార్యక్రమం

చిన్నంబావి బిజెపి పార్టీకార్యాలయంలో తెలంగాణవియోచన దినోత్సవం కార్యక్రమం

మండల ప్రధాన కార్యదర్శి అనుకలి సంపత్

చిన్నంబావి ప్రజా వాణి సెప్టెంబర్ 17

చిన్నంబావి మండలం బిజెపి కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. చిన్నంబావి మండల బిజెపి ప్రధాన కార్యదర్శి అనుకలి సంపత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మూడు రంగుల జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం బిజెపి నాయకులు మాట్లాడుతూ ఆనాటి రజాకార్లు అరాచకాలు ప్రజలపై జరిగిన అక్రమాలు తెలంగాణ ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తు చేసుకున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో జరిగిన పోలీస్ చర్య ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో విలీనమైన చారిత్రక ఘటన ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల స్వేచ్ఛ హక్కుల ప్రజాస్వామ్య విలువల కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. తెలంగాణ వియోచనను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని అన్నారు. అలాగే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి జగ్గారి శ్రీధర్ రెడ్డి. జిల్లా కౌన్సిల్ మెంబర్ గోపాల్ నాయుడు, మండల ఉపాధ్యక్షులు గణేష్ రెడ్డి,మండల బీసీ మోర్చ అధ్యక్షుడు జింకల కిరణ్ కుమార్, మండల సీనియర్ నాయకులు డి నారాయణ బీజేవైఎం ప్రధాన కార్యదర్శి భగవాన్, ఓబిసి ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, నరేష్, రాజు మరియు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.