చినుకుపడితే చాలు.. కాగతి యనమసామనపల్లి రోడ్డు జలమయం

చినుకుపడితే చాలు.. కాగతి యనమసామనపల్లి రోడ్డు జలమయం మన ప్రజావాణి చౌడేపల్లి: కొద్దిపాటి వర్షానికే కాగతి యనమసామనపల్లి రోడ్డు జలమయంగా మారుతోంది. చౌడేపల్లి మండలం కాగతి గ్రామ పంచాయతీ పరిధిలో సరైన వర్షపు నీటి కాలువలు లేకపోవడంతో వర్షం కురిసిన ప్రతిసారీ రహదారిపై నీరు నిలిచిపోతోంది. దీంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు కాగతికి చెందిన పాపులమ్మ నివాసముంటున్న పూరిగుడిసెలోకి వర్షపు నీరు ప్రవేశించడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. గుడిసె ఇప్పటికే శిథిలావస్థకు చేరుకోవడంతో ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి...