*చిటకోడూరు వాగుపై వంతెన నిర్మించాలని మంత్రికి వినతి*
జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 26 (ప్రజావాణి):
జనగామ జిల్లా కేంద్రంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విచ్చేసిన రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి, జనగామ జిల్లా ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని చిటకోడూరు బ్రిడ్జి సాధన సమితి సభ్యులు కలిసి వినతి పత్రం అందజేశారు.
చిటకోడూరు బ్రిడ్జి సాధన సమితి అధ్యక్షుడు యాసారపు కరుణాకర్, డీసీసీ ఉపాధ్యక్షుడు కొత్త కరుణాకర్ రెడ్డి, సింగరి ప్రశాంత్, కర్రే కమలాకర్, కూరాకుల నాగరాజు తదితరులు మంత్రిని కలిసి చిటకోడూరు వాగుపై హై లెవెల్ వంతెన నిర్మించాలని కోరారు.

నాలుగు సంవత్సరాల క్రితం కురిసిన భారీ వర్షాలకు వాగుపై ఉన్న కల్వర్టు కొట్టుకుపోయిందని, దీని వల్ల చుట్టుపక్కల పది గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.