*చింతా ప్రభాకర్‌కు దళిత జర్నలిస్టు ఫోరం రాష్ట్ర మహాసభలకు ఆహ్వానం*
• అక్టోబర్ 7న సంగారెడ్డిలో 11వ రాష్ట్ర మహాసభలు
మహాసభలను విజయవంతం చేయాలని పిలుపు
• రాష్ట్ర అధ్యక్షుడు తలారి యాదగిరి, జిల్లా అధ్యక్షుడు రామని అశోక్
మన సమగ్ర ప్రజావాణి
సంగారెడ్డి, సెప్టెంబర్ 18 సంగారెడ్డి జిల్లా ప్రతినిధి
దళిత జర్నలిస్టుల ఫోరం ( ఆధ్వర్యంలో అక్టోబర్ 7న దళిత జర్నలిస్ట్ ఫోరం సంగారెడ్డిలో నిర్వహించనున్న 11వ రాష్ట్ర మహాసభలకు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ను డి జె ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు తలారి యాదగిరి, జిల్లా అధ్యక్షుడు రామని అశోక్ ఆధ్వర్యంలో గురువారం ఆహ్వానించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో డి జె ఏఫ్ నాయకులు మహాసభల నిర్వహణ, లక్ష్యాలు, డిమాండ్లను ఎమ్మెల్యేకు వివరించారు.
పోతిరెడ్డిపల్లి ఎక్స్ రోడ్‌లోని
పి ఏస్ ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో మహాసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దళిత జర్నలిస్టుల హక్కుల సాధన, సమస్యల పరిష్కారం, సామాజిక న్యాయం కోసం మహాసభల్లో పలు డిమాండ్లతో తీర్మానాలు చేయనున్నట్లు నాయకులు పేర్కొన్నారు.
దళిత జర్నలిస్టులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్, ఇళ్ల స్థలాలు కల్పించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య, కుటుంబ సభ్యులకు పరిమితి లేని వైద్య సదుపాయం, ఉచిత బస్, రైలు పాసులు అందించాలని కోరారు.
అలాగే దళిత జర్నలిస్టులకు అభయహస్తం కింద రూ.12 లక్షలు, అకాల మరణం చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా, నిరుద్యోగ భృతిగా నెలకు రూ.15 వేల చొప్పున అందించాలని డిమాండ్ చేశారు. సీనియర్ దళిత జర్నలిస్టులకు నామినేటెడ్ పదవులు, ప్రెస్ అకాడమీ చైర్మన్, సభ్యులుగా అవకాశం కల్పించాలని కోరారు.
మహాసభలను విజయవంతం చేసేందుకు జర్నలిస్టులు, మేధావులు, ప్రజా సంఘాలు సహకరించాలని డి జె ఎఫ్ నాయకులు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ముక్కగల్ల యాదన్న, కోశాధికారి ఎర్రోళ్ల సంపత్ కుమార్, హెచ్. దాసు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే వెంట పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.