చాప కింద నీరులా ముంచుకొస్తున్న ముప్పు

*చాప కింద నీరులా ముంచుకొస్తున్న ముప్పు* *రాయికల్, సెప్టెంబర్ 27 (ప్రజావాణి):* ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారిని కళ్లతో చూడలేము. కానీ కళ్ల ముందే కనిపిస్తూ, రోజూ మన ఇంట్లోకి చొరబడుతూ మన భూమిని, ఆరోగ్యాన్ని, భవిష్యత్తును నాశనం చేస్తున్న మరో మహమ్మారి ప్లాస్టిక్. ఉదయం పాల కవర్ నుంచి టీ తాగే గ్లాసు, టిఫిన్ పార్సిల్ కవర్, కూరగాయల సంచి, మంచినీటి బాటిల్, షాంపూ డబ్బా, బిస్కెట్ ప్యాకెట్ వరకు మన జీవితం ప్లాస్టిక్ తో ముడిపడిపోయింది. 1950 వరకు పెద్దగా లేని...