prajavaani.net
Newspaper Banner
Date of Publish : 10 September 2026, 8:03 am Digital Edition : PRAJA VANI

చాకలి ఐలమ్మ వర్ధంతి 

చాకలి ఐలమ్మ వర్ధంతి

సందర్భంగా ఘన నివాళులు. తెలియజేస్తూ.

కూకట్పల్లి నియోజకవర్గం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం మాజీ చైర్మన్ బిఆర్ఎస్ పార్టీ నాయకుడు మొలుగు ఆనంద్ రావు.

 

కూకట్పల్లి విలేజ్ (ప్రజావాణి) సెప్టెంబర్ 10 ప్రతినిధి మునిపల్లి నరేష్ యాదవ్.

 

 

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ (చిట్యాల ఐలమ్మ) వర్ధంతి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 10వ తేదీన నిర్వహించబడుతుంది. ఆమె 1985 సెప్టెంబర్ 10న పరమపదించారు. తెలంగాణ ప్రభుత్వం ఆమె పోరాట స్ఫూర్తిని గౌరవిస్తూ ప్రతి ఏటా ఐలమ్మ వర్ధంతి, జయంతి (సెప్టెంబర్ 26) వేడుకలను అధికారికంగా నిర్వహిస్తోంది.

జననం: 26 సెప్టెంబర్, 1895 (వరంగల్ జిల్లా, రాయపర్తి మండలం, కిష్టాపురం గ్రామం)మరణం: 10 సెప్టెంబర్, 1985 (పాలకుర్తి)పోరాట విశిష్టత: విసునూరు దేశ్‌ముఖ్ (రామచంద్రారెడ్డి) అరాచకాలకు, భూకబ్జాలకు ఎదురొడ్డి, తన 4 ఎకరాల భూమిని, పంటను కాపాడుకుని తెలంగాణ సాయుధ పోరాటంలో అగ్రగామిగా నిలిచారు.ప్రభుత్వ గౌరవాలు: హైదరాబాద్ కోఠిలోని తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయానికి వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంగా నామకరణం చేశారు.