prajavaani.net
Newspaper Banner
Date of Publish : 27 September 2026, 3:29 pm Digital Edition : SUDHAKAR NALGONDA CHANDOOR

చాకలి ఐలమ్మ పోరాటం నేటి మహిళా లోకానికి స్ఫూర్తి కావాలి – ఎమ్మెల్యే

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణ పూర్ మండల కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర రజక సహకార సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం తో కలిసి పాల్గొని వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలలో జన్మించి నాటి అన్యాయాన్ని ధిక్కరించిన వీర వనిత ఐలమ్మ. చాకలి ఐలమ్మ పోరాటం నేటి మహిళా లోకానికి స్ఫూర్తి కావాలి. ఐలమ్మ స్ఫూర్తితో మహిళలందరూ కలిసి బెల్ట్ షాపులు లేకుండా చేయాలి. మునుగోడు ప్రాంతం గత కొన్ని ఏళ్లనుండి నుండి సాగునీరు లేక ఎడారిలా మారింది. గత ప్రభుత్వం శివన్న గూడెం రిజర్వాయర్ ఏర్పాటు చేస్తానని శంకుస్థాపన చేసి మధ్యలోనే వదిలేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి సీఎం రేవంత్ రెడ్డి తో ఎన్నోసార్లు డిండి ప్రాజెక్టు నుండి వచ్చేలా ఏర్పాటు చేయాలని చెప్పాను. అదే విషయమై నకిరేకల్ సభలో సీఎంతో మాట్లాడి ఒప్పుకున్నాకే శాలువా కప్పాను. దానికి కూడా రేవంత్ రెడ్డిని మొన్నటి వరకు తిట్టి మంత్రి పదవి కోసమే కలిసానని బద్నాం చేస్తుండ్రు. తనకు మంత్రి పదవి ఇవ్వడం అనేది సీఎం రేవంత్ రెడ్డి చేతిలో లేదని, అధిష్టానం చేతిలోనే ఉంది. ఎల్బీనగర్ నుండి పోటీ చేస్తే రేవంత్ రెడ్డి తో పాటు అధిష్టానం మంత్రి పదవి ఇస్తానని చెప్పిన, మునుగోడు ప్రాంతం కోసమే ఇక్కడి నుండి పోటీ చేశా. నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎంతో స్థానిక ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి మాట్లాడతాం అని అన్నారు. మిగిలిన రెండు సంవత్సరాల కాలంలో నియోజకవర్గ సమస్యలని తీర్చి అభివృద్ధి చేస్తానని అన్నారు.