చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ దీపక్ తివారి
చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ దీపక్ తివారి ప్రజా వాణి, వికారాబాద్ జిల్లా, సెప్టెంబర్26: శనివారం కలెక్టరేట్ కార్యాలయ సమావేశం హాలు నందు బీసీ వెల్ఫేర్ అధికారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ దీపక్ తివారి ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ ధైర్యసాహసాలు,పోరాట స్ఫూర్తి చిరస్మరణీయమని అన్నారు.అణగారిన వర్గాల హక్కుల కోసం...