prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 6:22 pm Digital Edition : SRIKANTH MULUGU

చల్వాయి గౌరారం చెరువులో నిమజ్జనానికి సిద్ధం తనిఖీ చేసిన డీఎస్పీ రవీందర్

 

ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)

వినాయక చవితి పండుగ సందర్భంగా గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లను పరిశీలించేందుకు ములుగు డీఎస్పీ రవీందర్ సోమవారం చల్వాయి గౌరారం చెరువును సందర్శించారు.
నిమజ్జనానికి చెరువు వద్ద చేసిన ఏర్పాట్లను, భద్రతా చర్యలను, ట్రాఫిక్ మళ్లింపు, లైటింగ్, బారికేడ్ల ఏర్పాటును డీఎస్పీ పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు.భక్తులు ప్రశాంతంగా, సురక్షితంగా నిమజ్జనం చేసుకునేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో పస్రా సీఐ దయాకర్ ఎస్ఐ తాజుద్దీన్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.