prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 September 2026, 8:59 am Digital Edition : PRAJA VANI

చత్రపతి శివాజీ టీం యూత్ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి కాలనీ ఫేస్ -I లో ఘనంగా వినాయక అన్న ప్రసాద వితరణ

చత్రపతి శివాజీ టీం యూత్ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి కాలనీ ఫేస్ -I లో ఘనంగా వినాయక అన్న ప్రసాద వితరణ

సెప్టెంబర్ 22. (ప్రజావాణి ప్రతినిధి)

జవహర్ నగర్, మేడ్చల్ జిల్లా, జవహర్ నగర్ చంద్రపురి కాలనీ డివిజన్ 2 కార్పొరేషన్ పరిధిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి కాలనీ ఫేస్-I లో చత్రపతి శివాజీ టీం యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా ముగిసింది. ఈ వేడుకలో బీజేపీ మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జ్ ఏనుగు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, వినాయక చవితి వేడుకలు ప్రజలందరిలో ఐక్యతను, భక్తిభావాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. చత్రపతి శివాజీ టీం యూత్ మరియు కాలనీవాసులు అందరూ కలిసికట్టుగా ఇలాంటి సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ డివిజన్ బీజేపీ అధ్యక్షులు కమలాకర్, మేడ్చల్ జిల్లా ఎస్టీ మోర్చా అధ్యక్షులు లావుడ్యా రాము నాయక్, జిల్లా ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి మరాఠి రాంబాబు, ఉపాధ్యక్షులు దొంతమళ్ళ రాంబాబు, మాజీ కార్పొరేటర్ పనుగంటి బాబు, మాజీ ఓబీసీ అధ్యక్షులు ఆదిములం రాఘవేంద్ర, షాగా అనిల్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అలాగే గణేష్ ఉత్సవ కమిటీ కన్వీనర్లు జవహర్ నగర్ డివిజన్ అరుణ్, చంద్రపూరి కాలనీ రాంబాబు మరియు జవహర్ నగర్ మాజీ సర్పంచ్ కారింగుల శంకర్ గౌడ్ తదితరులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. చత్రపతి శివాజీ మహారాజ్ యూత్ టీం సభ్యులు గరడ్ దత్తా, మల్లూరి శ్రీనివాస్ (బొట్టు), కే. సాయి, కోటగిరి సంతోష్, గుండెటి యశ్వంత్, మల్లూరి వివేక్, గరడ్ ఆరుషి తదితరులు ఈ కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. ఈ వేడుకను విజయవంతం చేయడంలో కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు విశేష కృషి చేశారు. కార్యక్రమంలో అధ్యక్షుడు ఆర్.సి. శ్రీకాంత్, జనరల్ సెక్రటరీ కుమ్మరి కృష్ణ, కోశాధికారి కత్తెర్ల కిరణ్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్స్ మూకర రవి, రంగుల హరికృష్ణ, గౌరవ అధ్యక్షులు ఎం. లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులు రంగుల శంకర్, ఆర్గనైజింగ్ సెక్రటరీస్ కొండ్రాతి నరేష్, కోటగిరి సంతోష్ కుమార్, కార్యదర్శులు గరడ్ మహిపత్రావు దత్త, చిక్క రఘు, కెమ్మసరం నగేష్, సహాయ కార్యదర్శులు కెమ్మసరం సుజాత, మన్నె జ్యోతి, టి. సుజాత, గౌరవ సలహాదారులు సిల్వేరి శ్రీకాంత్, కెమ్మసరం చంద్రయ్య, పండుగ సతీష్ యాదవ్ పాల్గొన్నారు. అలాగే కార్యవర్గ సభ్యులు సి.హెచ్. బస్వరాజు, ఎర్ర వెంకటేష్, ఎం. వంశీ, వై. మహేందర్, చట్టు చిరంజీవి, తన్నీరు నాగరాజు, కుంచాల నవీన్ కుమార్, మిత్రా గౌతమ్, ఏ. నాగచారి, ఆర్. చిత్తారి తదితరులు పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.