చంద్రబాబు అరెస్టు ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి అధ్యాయం న్యాయం గెలిచింది.సత్యం నిలిచింది: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
అమరావతి, సెప్టెంబర్ 9 ప్రజావాణి మూడేళ్ల క్రితం అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అక్రమ కేసులతో అరెస్టు చేసి 53 రోజుల పాటు నిర్బంధించడం ప్రజాస్వామ్య చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. సెప్టెంబర్ 9వ తేదీ తెలుగుజాతి చరిత్రలో ఎన్నటికీ మరచిపోలేని రోజని పేర్కొన్నారు. బుధవారం విజయవాడ క్యాంపు కార్యాలయంలో మంత్రి అచ్చెన్నాయుడు కొవ్వొత్తులు వెలిగించి, ఆనాటి ఘటనలను గుర్తు చేసుకుంటూ న్యాయం గెలిచింది.. సత్యం నిలిచింది అనే...