చంద్రబాబుపై మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి ఘాటు విమర్శలు: “ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చెప్పడంలో ఆయనే నంబర్ 1”

పోరుమామిళ్ల సెప్టెంబర్ 10 ప్రజావాణి"ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు చెప్పడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మించిన వారు ఈ ప్రపంచంలోనే ఎవరూ లేరు" అని మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నిన్న అంబేద్కర్ కోనసీమ జిల్లా పర్యటనలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై చంద్రబాబు చేసిన భూ ఆరోపణలను తిప్పికొడుతూ కూటమి ప్రభుత్వం చెబుతున్నవన్నీ పచ్చి అబద్ధాలని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన పనులకే...