చందుపట్లగూడ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు

ఘట్కేసర్, సెప్టెంబర్ 20 (ప్రజావాణి): ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని చందుపట్ల గూడలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ఆదివారం గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణేశుడిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఘట్కేసర్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ చందుపట్ల వెంకటరెడ్డి, స్థానిక ఎస్సై శేఖర్, ఘట్కేసర్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, చందుపట్ల చంద్రారెడ్డి, చందుపట్ల లక్ష్మారెడ్డి, చందుపట్ల నరసింహారెడ్డి, సీహెచ్. హరికాంత్ రెడ్డి, చ. సాయి చరణ్ రెడ్డి, కంభం హరికిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.