చండూర్ మున్సిపాలిటీలో నిద్రిస్తున్న నిఘా యంత్రాంగం.. ప్రధాన సెంటర్లలో సీసీ కెమెరాలేవీ?

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి చండూరు మున్సిపాలిటీ పరిధిలో సీసీ కెమెరాలు లేక నిఘా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణంలోని పలు ప్రధాన కేంద్రాలలో ఒక్క సీసీ కెమెరా కూడా లేకపోవడంతో నేరాలకు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. బస్టాండ్, మెయిన్ చౌరస్తా, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల పరిసరాలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బాలికల పాఠశాలలు, మార్కెట్ యార్డ్, అత్యంత సమీపంలోని ప్రాంతాల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు....