prajavaani.net
Newspaper Banner
Date of Publish : 29 September 2026, 11:43 am Digital Edition : SUDHAKAR NALGONDA CHANDOOR

చండూర్ మున్సిపాలిటీలో నిద్రిస్తున్న నిఘా యంత్రాంగం.. ప్రధాన సెంటర్లలో సీసీ కెమెరాలేవీ?


నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి
చండూరు మున్సిపాలిటీ పరిధిలో సీసీ కెమెరాలు లేక నిఘా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణంలోని పలు ప్రధాన కేంద్రాలలో ఒక్క సీసీ కెమెరా కూడా లేకపోవడంతో నేరాలకు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. బస్టాండ్, మెయిన్ చౌరస్తా, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల పరిసరాలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, బాలికల పాఠశాలలు, మార్కెట్ యార్డ్, అత్యంత సమీపంలోని ప్రాంతాల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా దొంగతనం జరిగినా, రోడ్డు ప్రమాదం జరిగినా, ఆకతాయిలు అల్లరి చేసినా ఆధారాలు లేక పోలీసులు చేతులెత్తేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా రాత్రి వేళల్లో మహిళలు, విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. చండూరు మున్సిపాలిటీలో కనీసం 10-15 సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయకపోవడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు, పోలీస్ శాఖ స్పందించి చండూర్ కెమెరాలో ప్రతి ప్రధాన లో హై క్వాలిటీ సీసీలను ఏర్పాటు చేయడం, కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.