నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి
చండూరు మున్సిపాలిటీ కేంద్రంలోని శివాజీ నగర్ లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. స్థానిక యువ నాయకులు రావిరాల నగేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహ నిమజ్జనం అంగరంగ వైభవంగా జరిగింది. కోలాటాల నడుమ గణపతి శోభాయాత్ర శివాజీ నగర్ నుండి ప్రారంభమై పట్టణ ప్రధాన వీధుల మీదుగా సాగింది. భక్తులు “గణపతి బప్పా మోరియా” అంటూ నినాదాలు చేస్తూ ఉత్సాహంగా నృత్యాలు చేశారు. నిమజ్జనానికి ముందు గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, లడ్డూ వేలం పాట నిర్వహించారు. అనంతరం భక్తులందరికీ అన్నప్రసాద వితరణ చేశారు. ఈ నిమజ్జన కార్యక్రమంలో శివాజీ నగర్ కాలనీ వాసులు, యువకులు, మహిళలు, ఉత్సవ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.