చండూరు శివాజీ నగర్ లో ఘనంగా గణేష్ శోభాయాత్ర – మున్సిపల్ చైర్మన్ డా. కోడి శ్రీనివాసులు, మాజీ సర్పంచ్ కోడి గిరిబాబు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా వేడుకలు
నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి చండూరు మున్సిపాలిటీ కేంద్రంలోని శివాజీ నగర్ కాలనీలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, మాజీ సర్పంచ్ కోడి గిరిబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహ శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. కోలాటాల నడుమ గణనాథుడి శోభాయాత్ర శివాజీ నగర్ నుండి ప్రారంభమై పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా సాగింది. "గణపతి బప్పా మోరియా" నినాదాలతో కాలనీ మార్మోగింది. యువకులు, మహిళలు ఉత్సాహంగా నృత్యాలు చేశారు. అంతకుముందు గణనాథుడికి ప్రత్యేక...