చండూరు లో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు: గణనాథుడి ని దర్శించుకున్న : మోగుదాల శేఖర్ గౌడ్ దంపతులు
సత్య హరిశ్చంద్ర నగర్ లో భక్తిశ్రద్ధలతో 4 వ రోజు ప్రత్యేక పూజలు
నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి
చండూరు మున్సిపాలిటీ పరిధిలోని ఒకటోవ వార్డు సత్య హరిశ్చంద్ర నగర్‌లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం 4 వ రోజు పూజా కార్యక్రమాలను నిర్వాహకులు భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చండూరు మండల ప్రజా ప్రతిభ రిపోర్టర్ మోగుదాల శేఖర్ గౌడ్ తన సతీమణితో కలిసి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం శేఖర్ గౌడ్ మాట్లాడుతూ.. ఆ విఘ్నేశ్వరుడి దివ్య ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, మహిళలు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి సేవలో తరించారు.