చండూరు మెయిన్ రోడ్డుపై అక్రమ పార్కింగ్ తో ప్రమాదాలు – పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయాలని ప్రజల డిమాండ్ – మన సమగ్ర ప్రజావాణిలో కథనాలు వచ్చినా పట్టించుకోని అధికారులు
నల్గొండ జిల్లా ప్రతినిధి (మన సమగ్ర ప్రజావాణి): చండూరు మున్సిపాలిటీ కేంద్రంలోని ప్రధాన రహదారిపై వాహనాలు ఇష్టానుసారంగా నిలపడం వల్ల నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనిపై మన సమగ్ర ప్రజావాణి పత్రికలో పలుమార్లు కథనాలు ప్రచురించినా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. *వివరాల్లోకి వెళ్తే...* చండూరు ప్రధాన రహదారి వెంబడి ఉన్న దుకాణాలు, కాంప్లెక్స్ ల ముందు వాహనదారులు రోడ్డుకు అడ్డంగా వాహనాలు పార్క్ చేస్తున్నారు. దీంతో రహదారి ఇరుకుగా మారి ట్రాఫిక్ జామ్ తో పాటు ప్రమాదాలు జరుగుతున్నాయి....