నల్గొండ జిల్లా ప్రతినిధి (మన సమగ్ర ప్రజావాణి):
చండూరు మున్సిపాలిటీ ప్రధాన రహదారిపై వాహనాలు ఇష్టానుసారంగా నిలపడం వల్ల నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. మన సమగ్ర ప్రజావాణి పత్రికలో పలుమార్లు కథనాలు ప్రచురించినా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వివరాల్లోకి వెళ్తే…
చండూరు ప్రధాన రహదారి వెంబడి ఉన్న దుకాణాలు, కాంప్లెక్స్ ల ముందు వాహనదారులు రోడ్డుకు అడ్డంగా వాహనాలు పార్క్ చేస్తున్నారు. ఈ రహదారి ఇరుకుగా మారి ట్రాఫిక్ జామ్ తో పాటు ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రధాన రహదారిపై ఈ సమస్య తీవ్రంగా ఉంది. పాదచారులు, విద్యార్థులు, మహిళలు రోడ్డు దాటేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ఢీకొంటున్నాయి.
పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయాలి – ప్రజల డిమాండ్:
ప్రధాన రహదారిపై వాహనాలు పెట్టకుండా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పార్కింగ్ స్థలం లేకపోవడం వల్లే రోడ్డుపై వాహనాలు పెడుతున్నారని, అధికారులు వెంటనే స్పందించి పార్కింగ్ ప్లేస్ చేసి, అక్రమ పార్కింగ్ లపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.