చండూరు మున్సిపాలిటీ నిర్లక్ష్యం – అంగడిపేట రాజీవ్ కాలనీలో మూడు నెలలుగా డ్రైనేజీ తీయక దుర్గంధం – రోగాల బారిన పడుతున్న కాలనీ వాసులు
నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి
చండూరు మున్సిపాలిటీ పరిధిలోని అంగడిపేట లోని రాజీవ్ కాలనీలో మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. గత మూడు నెలలుగా డ్రైనేజీలు తీయకపోవడంతో కాలనీ మొత్తం దుర్గంధ భరితంగా మారింది. డ్రైనేజీలో పేరుకుపోయిన చెత్త, మురుగు నీరు రోడ్లపైకి వచ్చి నిలిచిపోవడంతో దోమలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో కాలనీ వాసులు డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
*కాలనీ వాసుల ఆవేదన:*
మున్సిపాలిటీ అధికారులకు, కౌన్సిలర్లకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే డ్రైనేజీలను శుభ్రం చేయించి, దోమల మందు కొట్టించాలని డిమాండ్ చేస్తున్నారు.
మున్సిపాలిటీ అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు.