చండూరు పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు
నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి వీరనారి చాకలి ఐలమ్మ జయంతి ని పురస్కరించుకొని చండూరు పురపాలక సంఘ కార్యాలయ ప్రాంగణంలో జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ డా. కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ వీరనారి చాకలి ఐలమ్మ తెలంగాణ ప్రాంతంలో సామాజిక అన్యాయం, దోపిడీ మరియు అణచివేతకు వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడి పోరాటం చేసిన వీరనారిగా చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని, ఆమె జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని కార్యక్రమంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ భూతరాజు...