prajavaani.net
Newspaper Banner
Date of Publish : 26 September 2026, 9:10 pm Digital Edition : SUDHAKAR NALGONDA CHANDOOR

చండూరు పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

వీరనారి చాకలి ఐలమ్మ జయంతి ని పురస్కరించుకొని చండూరు పురపాలక సంఘ కార్యాలయ ప్రాంగణంలో జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ డా. కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ వీరనారి చాకలి ఐలమ్మ తెలంగాణ ప్రాంతంలో సామాజిక అన్యాయం, దోపిడీ మరియు అణచివేతకు వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడి పోరాటం చేసిన వీరనారిగా చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని, ఆమె జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని కార్యక్రమంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ భూతరాజు దశరథ మాట్లాడుతూ వీరనారి చాకలి ఐలమ్మ చేసిన సామాజిక పోరాటం, ధైర్యసాహసాలు, ఆత్మగౌరవం మరియు అణగారిన వర్గాల హక్కుల కోసం చేసిన కృషిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ ఎల్. మల్లేశం, కౌన్సిల్ సభ్యులు శ్రీమతి తేలుకుంట్ల రాజకుమారి చంద్రశేఖర్, శ్రీమతి జెల్ల ధనమ్మ శ్రీనివాస్, శ్రీ కొన్రెడ్డి మధు, శ్రీమతి కోడి సుష్మ వెంకన్న, శ్రీ కటకం రమేష్ , కో-ఆప్షన్ సభ్యులు శ్రీ షేక్ ఖలీల్, షేక్ సలీమా షరీఫ్, మేనేజర్ జి. రాములు, సీనియర్ అసిస్టెంట్ ఏ. సాయిభారద్వాజ్, జూనియర్ అసిస్టెంట్ ఎ. జగన్, సీనియర్ అకౌంటెంట్ పి. శృతి, వార్డ్ ఆఫీసర్లు జి. శ్రీరాములు, బి. సాయిరాం, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ యమ్. అరవింద్ రెడ్డి, బిల్ కలెక్టర్లు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.