prajavaani.net
Newspaper Banner
Date of Publish : 30 September 2026, 10:13 pm Digital Edition : SUDHAKAR NALGONDA CHANDOOR

చండూరు తహశీల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

చండూరు మండల తహశీల్దార్ కార్యాలయంలో బుధవారం కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. మండలంలోని 30 మంది లబ్ధిదారులకు మొత్తం చెక్కులను అధికారులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాసులు హాజరై లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – తెలంగాణ ప్రభుత్వం పేద ఆడబిడ్డల పెళ్లికి అండగా నిలుస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రమాకాంత్ శర్మ, కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, ఆర్.ఐ మురళీ కృష్ణ, జిపిఓ మణికాంత్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. లబ్ధిదారులు ప్రభుత్వానికి, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.