నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి
చండూరులోని గీతా విద్యాలయంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పాఠశాల ప్రిన్సిపాల్ నర్సింహా చారి ఆధ్వర్యంలో విఘ్నేశ్వరుడి శోభాయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహించారు. విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి, “గణపతి బప్పా మోరియా” అంటూ నినాదాలు చేస్తూ శోభాయాత్రలో ఉత్సాహంగా ఉంటారు. డప్పు చప్పుళ్లు, కోలాటాలతో పాఠశాల ప్రాంగణం అంతా భక్తి భావంతో మార్మోగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ నర్సింహా చారి మాట్లాడుతూ విద్యార్థులలో భక్తి భావంతో పాటు సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన పెంచడమే లక్ష్యంగా ప్రతి ఏటా గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం విద్యార్థులకు ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.